తారక్ ఈ విషయంలో సపోర్ట్ చేయండి..!

Actress Payal Ghosh Urges Jr NTR To Take Forward Organ Donation Initiative Through His Fans To Help The Needy At This Tough Situation

పాయల్ ఘోష్.. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ. ఆ సినిమాలో హారిక పాత్రలో అలరించిన పాయల్.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే వుంది. అయితే ఇటీవల ఎన్టీఆర్ గురించి మాట్లాడి మళ్ళీ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఎన్టీఆర్ మంచి సినిమా కుటుంబం నుండి వచ్చారని కానీ ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడ్డారని ఆమె పేర్కొంది. ఎన్టీఆర్ గతం గురించి తెలుసుకున్న తాను ఏడ్చేశానని… ఎన్టీఆర్ పై జాలి చూపండి ఎన్టీఆర్ కు గౌరవం ఇవ్వండి అంటూ ఆమె ట్వీట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి తారక్ ను ఒక విన్నపం చేస్తుంది పాయల్ ఘోష్. రీసెంట్ గా అవయవాదం చేయడానికి తాను నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పింది. ఇక ఇప్పుడు తారక్ ను ట్యాగ్ చేస్తూ దీనికి సపోర్ట్ చేయాలని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని.. దీనివల్ల సమాజానికి మంచిచేసినవాళ్లం అవుతామని పేర్కొంది. మరి దీనికి ఎన్టీఆర్ రియాక్ట్ అవుతాడా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారా? చూడాలి…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.