సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన వేణు ఊడుగుల నిజ జీవిత సంఘటనలతో ఆ మూవీ ని రూపొందిందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు వేణు ఇప్పుడు 1990 ల కాలం నాటి సామజిక సంఘటనల నేపథ్యంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా “విరాటపర్వం ” మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఈ మూవీ పై హైప్ క్రియేట్ అయింది. “విరాటపర్వం ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“విరాటపర్వం ” మూవీ షూటింగ్ పూర్తి కాగానే దర్శకుడు వేణు మరో మూవీ కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 1950 సంవత్సరంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా ఒక కథను సిద్ధం చేశారు. ఒక స్టార్ హీరో తో ఆమూవీ తెరకెక్కించే పయత్నాలలో వేణు ఉన్నట్టు సమాచారం. ప్రముఖ రచయిత చలం “మైదానం “నవలను వెబ్ సిరీస్ గా వేణు ఊడుగుల నిర్మించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించడానికి తన అసిస్టెంట్స్ లో ఒకరికి వేణు అవకాశం ఇస్తున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























