సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై స్పందించి ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లేదని తెలిపారు. ఇక ఎప్పటినుండో ఈ సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి సూర్య పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జీవీ ప్రకాష్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా నుండి సూర్య బర్త్ డే కి స్పెషల్ అప్డేట్ రానున్నదని తెలిపాడు. మరి ఈ నెల23 న సూర్య పుట్టిన రోజు.. ఆ రోజు ఏం అప్ డేట్ వస్తుందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Something special from team #SooraraiPottru is on the way for Suriya sirs bday …. details in the coming days … #update
— G.V.Prakash Kumar (@gvprakash) July 11, 2020
కాగా అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నికేత్ బొమ్మి. కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























