టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఎంతో మంది పాల్గొని మొక్కలు నాటారు. దీనిలో భాగంగానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో సమంత కూడా తన మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి.. జూబీలీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. నాగార్జున దగ్గరుండి మరీ మొక్కలు నటించారు. ఇక ఛాలెంజ్ ను పూర్తి చేసిన సమంత తర్వాత ఛాలెంజ్ ను కీర్తి సురేశ్, రష్మిక మందన్ లకు విసిరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోపాటు సామ్ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది. తెలుగులో అయితే ఇంకా ఏ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టలేదు సామ్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: