ప్రభాస్ 20.. ఈ సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూసినంతగా ఫ్యాన్స్ మరే సినిమా కోసం చూసుండకపోవచ్చు. అయితే మొత్తానికి ఇన్ని రోజులకు ప్రభాస్ ఫ్యాన్స్ ను కూల్ చేసే అప్ డేట్ వచ్చింది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు.. తమ హీరో సినిమా నుండి ఒక్క అప్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఇంత కాలం ఎదురుచూసిన వారికి డబల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు చిత్రయూనిట్. ప్రభాస్ 20 టైటిల్,ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా.. జులై 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్ తొపాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ న్యూస్ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
The announcement you all have been waiting for! Title & first look of #Prabhas20 will be out on 10.7.2020 at 10 AM🕺#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju garu @itsBhushanKumar #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @TSeries pic.twitter.com/64e4maW9us
— UV Creations (@UV_Creations) July 8, 2020
ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ను అనుకుంటున్నారు. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.




ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























