మెగా అల్లుడి మంచి నిర్ణయం..!

Mega Hero Kalyan Dev Goes In To Self Quarantine Away From His Family Members

విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్  దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ.. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు దేవ్. టీవీ సీరియళ్ల దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ‘సూపర్ మచ్చి’ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్‌ తో వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలివుంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ షూట్ ను ప్రారంభించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేంటంటే… రోజూ షూటింగ్‌లో పాల్గొంటున్న కళ్యాణ్ దేవ్ ఇంటికి వెళ్లకుండా తన ఫ్యామిలీ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తనకి తానుగా స్వీయ నిర్భందం విధించుకున్నాడట. బయట షూటింగ్‌లో పాల్గొని ఇంట్లోకి వెళ్లడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదని భావించిన కళ్యాణ్ దేవ్.. తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో స్వీయ నిర్భందం విధించుకున్నట్లుగా సమాచారం. షూటింగ్ పూర్తయ్యే వరకూ ఇలానే ఉంటాడట. ఇక కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ ప్రశంసిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా నటిస్తుంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.