కరోనా ఎఫెక్ట్.. బాహుబలి – భల్లాలదేవలకు కూడా మాస్క్ లు..!

Director SS Rajamouli Creates Awareness On Corona Virus In A Unique Way, Shows Bahubali and Ballaladeva Wearing Masks

కరోనా ఎఫెక్ట్ బాహుబలి సినిమాపై కూడా పడింది. అదేంటి బాహుబలి ఎప్పుడో వచ్చింది.. కరోనా ఇప్పుడు వచ్చింది కదా అని డౌట్ కదా. అసలు సంగతి ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచంమొత్తం కరోనా వైరస్ తో వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఅందరూ సోషల్ డిస్టెన్స్ ను మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల మాస్క్, శానిటజైర్ జీవితంలో ఒక బాగం అయిపోయాయి. ఇంటినుండి బయటకు వచ్చేముందు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని, ప్రతిఒక్కరు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడాలని సెలెబ్రిటీస్ దగ్గర నుండి సామాన్య ప్రజల వరకూ అందరూ పిలుపునిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ కరోనా పై వచ్చిన కామెడీ లు.. ఎడిటింగ్ వీడియోలు కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచు. ఒక్కొక్కరు తమ క్రియేటివిటీ కి పదునుపెట్టి కరోనా పై మీమ్స్, వీడియోస్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా బాహుబలి సినిమాను కూడా వాడుకున్నారు. బాహుబలి సినిమాలోని బాహుబలి – భల్లాలదేవుడు ఫైటింగ్ సీన్లో మాస్కులు ధరించి పోరాడుతున్నట్టుగా గ్రాఫిక్స్ చేశారు. మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి అని, మీరు కూడా మాస్కులు ధరించడం మర్చిపోవద్దని ఆ గ్రాఫిక్స్ వీడియోలో పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను రాజమౌళి కూడా తన ట్విట్టర్, ఇన్స్టా లో పోస్ట్ చేసి ప్రశంసలు కురిపించాడు. అవిటూన్ ఇండియా, కొల్లాజ్ యునైటెడ్ సాఫ్ట్ వీఎఫ్ఎక్స్ టీమ్ లు మంచి ప్రయత్నం చేశాయని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని పేర్కొన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + nine =