స్టార్ హీరోల కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం అంటే డైరెక్టర్స్ కు అంత ఈజీ పని కాదు. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వాలి. అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో తెలీదు.. అలా వాళ్ళకి కావాల్సిన అన్ని ఎలిమింట్స్ వుండేలా చూసుకొని.. హీరోని పరిచయం చేస్తారు. ఇక హీరో భవిష్యత్తు అనేది తర్వాత తాను చేసే సినిమాలపై ఆధారపడి ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేసే అవకాశం తొలుత రాజమౌళి వద్దకే వచ్చిందట. అయితే, చరణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించడానికి తాను భయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చరణ్ ను పరిచయం చేయాలని చిరంజీవి నుంచి తొలి ఆఫర్ తనకే వచ్చిందని, అయితే తాను చేయలేనని చెప్పేశానని అన్నాడు. రామ్ చరణ్ లోని ప్లస్, మైనస్ లు తనకు తెలియకపోవడమే ఇందుకు కారణమని.. ఫైట్స్ ఎలా చేస్తాడో తనకు తెలియదని, డ్యాన్స్, ఎమోషన్స్ విషయంలో కూడా అవగాహన లేదని చెప్పుకొచ్చారు. అన్నిటికంటే ముందు చిరంజీవి కుమారుడు కావడం, అభిమానుల్లో ఉండే భారీ అంచనాలను మనసులో పెట్టుకుని, తాను ఆ ఆఫర్ ను వదిలేసుకున్నానని తెలిపారు. ఇక ఆ తరవాత విషయం తెలిసిందే. పూరీ చరణ్ ను పరిచయం చేసాడు. ఆ తర్వాత రాజమౌళి మగధీర సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: