ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “సింహా ” , “లెజండ్ ” మూవీస్ తరువాత దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న #NBK106 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “అరవింద సమేత వీర రాఘవ “మూవీ లో బాల్ రెడ్డి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నవీన్ చంద్ర #NBK106 మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం. దర్శకుడు బోయపాటి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఈ మూవీ లో ఒక కొత్త హీరోయిన్ ను పరిచయం చేయనున్నామని , ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేశామని , సరైన టైమ్ లో వారిలో ఒకరిని హీరోయిన్ గా అనౌన్స్ చేస్తామని చెప్పారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ కి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























