“ఒరు అదార్ లవ్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఆ మూవీలోని ఒక సాంగ్ లో కన్ను గీటే సీన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 7 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్న ప్రియా ప్రకాష్ కొన్ని రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ నుండి వైదొలగిన విషయం తెలిసిందే. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ వైదొలగిన కారణాన్ని ఒక వీడియో ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన హెల్త్, మెంటల్ పీస్ కారణంగా ఇన్ స్టా గ్రామ్ నుండి కొంతకాలం బ్రేక్ తీసుకున్నానని, లైక్స్ , ఫాలోవర్స్ &వ్యూస్ తో ఒత్తిడి ఫీల్ అయ్యానని, ఇన్ స్టా గ్రామ్ లో తిరిగి వచ్చానని, తన గురించి జెన్యూన్ గా ఆందోళన చెందిన అభిమానులకు థ్యాంక్స్ అని ప్రియా ప్రకాష్ వీడియో లో తెలిపారు. ప్రియా ప్రకాష్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ “శ్రీదేవి బంగళా “లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో తన రెండవ మూవీ “లవ్ హ్యాకర్స్ “కు ప్రియా ప్రకాష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్ర శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ తో టాలీవుడ్ , “విష్ణుప్రియ “మూవీ తో శాండల్ వుడ్ కు ప్రియా ప్రకాష్ పరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























