బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో గుర్తింపు పొందిన నిధి అగర్వాల్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ, జయం రవి హీరోగా రూపొందుతున్న “భూమి ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. “భూమి ” తమిళ మూవీ తో నిధి కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణం గా లాక్ డౌన్ లో పనులు లేక లక్షలాది వలస కార్మికులు కాలినడకన తమ స్వంత ఊర్లకు ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. వలస కూలీల ఆకలి తీర్చడానికి ప్రభుత్వాలతోపాటు పలు సంస్థలు కూడా తోడ్పడుతున్నవిషయం తెలిసిందే. కరోనా బాధితులకై పలు చారిటీ సంస్థలకు విరాళాలు అందజేసిన నిధి ఇప్పుడు వలస కూలీల ఆకలి తీరుస్తున్నారు. వలస కార్మికుల కోసం నిధి తన ఇంటిలో స్వయంగా జామ్ బ్రెడ్ లను ప్యాక్ చేసి కాలినడకనే వెళుతున్న వలస కూలీలకు అందజేస్తున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా నిధి వెల్లడించారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























