వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీ అవ్వనున్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక్కసారి లాక్ డౌన్ కనుక తీసేస్తే షూటింగ్ లతో బిజీ కానున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేసాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాక్ డౌన్ వల్ల ఆగింది. ఆ సినిమా చేస్తూనే నానితో ‘నిన్ను కోరి ‘ తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఆతర్వాత ‘టాక్సీవాలా’ సినిమా హిట్ కొట్టిన దర్శకుడితో సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ ఓడెల కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవల శ్రీకాంత్ చెప్పిన కథ నచ్చడంతో అతడికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. అంతేకాదు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రస్టిక్ లవ్‌స్టోరి అని టాక్. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడట. టక్ జగదీష్ చిత్రంలో నాని ఆంధ్ర యాసలో మాట్లాడే యువకుడిగా కనపడబోతన్నారు. అంతకు ముందు ‘కృష్ణార్జునయుద్ధం’ చిత్రంలో చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడే యువకుడిగా నటించారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: