మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లిస్ట్ లో ఒకప్పుడు మొదట వినిపించిన పేరు రానా. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ నుండి బయటకి వచ్చేశాడు. సోషల్ మీడియా లో తన ప్రేమను బయట పెట్టడం.. చెప్పిన కొద్దీ రోజులకే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకోవడం అన్నీ చక చకా జరిగిపోయాయి. అయితే వీరి ఎంగేజ్ మెంట్ అయినా కూడా అసలు రానా-మిహికా ల మధ్య ప్రేమ ఎలా స్టార్ట్ అయింది అన్న విషయాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు చాలా మందికి. ఎందుకంటే రానా ఏమో హీరో, మిహికా ఏమో ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థను నడుపుతోంది.మరి వీరిద్దరి ప్రేమ ఎలా మొదలైంది విషయాలు రానానే చెప్పాడు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రానాతో లక్ష్మీ మంచు ఇన్స్టాగ్రామ్ లైవ్ నిర్వహించింది. ఇక లైవ్ లో ఎవరీ మిహికా.. ఎప్పటినుండి ఈ లవ్, ఏంటి కథ? అని అడుగగా బాబాయ్ విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత క్లాస్ మెట్ ఆశ్రిత. నాకు చాలా కాలం నుండి మిహికా తెలుసు. లాక్ డౌన్ కు ముందే నేను తనని కలిశా.. ఈ విషయంపై మేము మాట్లాడుకున్నాం… అలా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. మనకు కరెక్ట్ పర్సన్ దొరికినప్పుడు వెంటనే ఫ్లో లో వెళ్ళిపోవాలి.. నేను చేసింది కూడా అదే. నేను మొదట మిహికా గురించి చెప్పినప్పుడు అమ్మానాన్న సర్ ప్రయిజ్ అయ్యారు.. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇదంతా ఒక్కరోజులోనే జరిగిపోయింది. మిహికా బాల్యం అంత హైదరాబాద్లోనే జరిగింది.
లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎంగేజ్మెంట్ ని సింపుల్ గా కానిచ్చేశారు. రామానాయుడు స్టూడియోలో కేవలం రానా, మిహికా కుటుంబ సభ్యుల సమక్షంలో రానా, మిహీకా నిశ్చితార్థం జరిగింది. ఇక డిసెంబర్ కల్లా పెళ్లి చేసేస్తామని ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు ఇదివరకే స్పష్టం చేశారు కూడా.
ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: