‘చిరుత’ సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుంది..!

Actress Neha Sharma Wishes To Have A Sequel To Mega Power Star Debut Movie Chirutha
Actress Neha Sharma Wishes To Have A Sequel To Mega Power Star Debut Movie Chirutha

నేహా శర్మ చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా చిరుత. ఈ సినిమాతోనే చరణ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా శర్మ నటించింది. ఈ సినిమాలో పెద్ద బిజినెస్ మేన్ కూతురిగా… పొగరు పాత్రలో బాగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక చిరుత తర్వాత కుర్రాడు సినిమా చేసింది. ఇక ఆ సినిమా తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందులోనూ నేహా శర్మ కూడా బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టిపెట్టడంతో ఇక్కడ అవకాశాలు రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు నేహా శర్మ కు చిరుత సినిమా సీక్వెల్ వస్తే బావుంటుందని అనిపిస్తుందట. ఇప్పుడు సడన్ గా నేహాకు ఈ సీక్వెల్ ఎందుకు గుర్తోచిందనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే..నేహా సోషల్ మీడియాలో బాగానేయాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను అప్పుడప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా నేహా శర్మ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ నేహా శర్మతో.. చిరుత చిత్రంలో మీరు అద్భుతంగా నటించారు. మరోసారి రాంచరణ్ తో కలసి నటిస్తే చూడాలని ఉంది అని కామెంట్ చేశాడు. దీనికి నేహా శర్మ బదులిస్తూ.. నేను కూడా ఎదురుచూస్తున్నా..చిరుత చిత్రానికి సీక్వెల్ వస్తే బావుంటుంది అని నేహా శర్మ కామెంట్ చేసింది. మరి ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ అంటే కష్టమేనేమో..


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.