ఫ్యూచర్ లో ఆ హీరోయిన్ టాప్ త్రీ ప్లేస్ లో ఉంటుందని అంటుంది చార్మీ. ఇంతకీ ఛార్మి ఏ హీరోయిన్ గురించి మాట్లాడుతుంది.. ఏ హీరోయిన్ ఫ్యూచర్ గురించి చెపుతుంది అని అనుకుంటున్నారు కదా.. ఇంకెవరూ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ కు జోడిగా అనన్య పాండే నటిస్తుంది. ఈ సినిమాకు ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఛార్మి అనన్య పాండే గురించి మాట్లాడుతూ.. అనన్యది లవ్లీ పర్సనాలిటీ.. తను సెట్స్ లో చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది.. కంట్రీ లో టాప్ త్రీ హీరోయిన్స్ లలో కచ్చితంగా అనన్య పాండే ఉంటుందని చెబుతుంది. మరి చూద్దాం ఫైటర్ సినిమా ఎలా ఉండబోతుందో.. ఛార్మి చెప్పింది నిజమవుతుందో?లేదో?




కాగా ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ముంబైలో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకోగా లాక్ డౌన్ వల్ల షూట్ కి బ్రేక్ పడింది. అయితే లాక్ డౌన్ వల్ల.. ముంబైలో కాకుండా ఇకపై ఇక్కడే షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























