ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్టీఆర్ అభిమాని కోరిక మేరకు నిన్న ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. రేపు పుట్టినరోజు కావడంతో…జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపమని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా డేవిడ్ వార్నర్ ను కోరగా “హ్యాపీ బర్త్ డే బడ్డీ” అంటూ ట్వీట్ చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు మరోసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘‘హ్యాపీ బర్త్‌డే జూనియర్ ఎన్టీఆర్’’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు.. జనతా గ్యారేజ్ సినిమాలోని పక్కా లోకల్ పాటకు భార్య కాండిస్తో కలిసి కాలు కదిపిన టిక్‌టాక్ వీడియోను షేర్ చేసి.. ‘‘మేం ప్రయత్నించాం కానీ.. ఈ డ్యాన్స్ చాలా ఫాస్ట్‌గా ఉంది’’ అంటూ సరదాగా క్యాప్షన్ జోడించాడు. ఇక ఈ విషెస్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. థ్యాంక్స్ వార్నర్ అన్నా.. లవ్ యూ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ మధ్య తెలుగు సినిమా, పాటల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా పాటలకు స్టెప్ లు వేయగా.. పోకిరి సినిమాలోని మహేష్ డైలాగ్, బాహుబలి సినిమాలోని డైలాగ్ చెప్పి అలరించాడు.



ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























