‘హ.. హ.. హ.. హాసిని’ అంటూ ‘బొమ్మరిల్లు’లో జెనీలియా చేసిన సందడిని అంత సులువుగా మరచిపోలేం. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినా.. తెలుగునాట ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది జెనీలియా. పెళ్లయ్యాక సినిమాలకు దూరం అయిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. రీ-ఎంట్రీకి రెడీ అవుతోందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించనుందట జెన్నీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సుజిత్ రూపొందించనున్న ‘లూసీఫర్’ రీమేక్‌లో ఓ కీలక పాత్ర కోసం జెనీలియాతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. అంతేకాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న కొత్త చిత్రంలోనూ కథను మలుపు తిప్పే పాత్రలో జెనీలియా నటించే అవకాశం ఉందని వినిపిస్తోంది.
మరి.. జెనీలియా కమ్ బ్యాక్ వార్తల్లో నిజానిజాలేమిటో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: