మే 20న యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రోజు కోసం ఆర్ఆర్ఆర్ సినిమా నుండి తమ హీరో కు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదని తెలిసింది. ఈ రోజు ఉదయమే చిత్రయూనిట్ లాక్ డౌన్ వల్ల కొన్ని టెక్నీకల్ ఇష్యూస్ వల్ల ఇంట్రడక్షన్ వీడియో కానీ.. ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయలేకపోతున్నాం అని తెలిపారు. ఇక ఇప్పుడు దీనిపై ఎన్టీఆర్ కూడా స్పందించాడు. తన పుట్టిరోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని.. అందరూ ఇంట్లోనే ఉండాలని కోరాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతీ ఏటా నా పుట్టిన రోజుకు మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఓ ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ అధికారులు సూచనలను పాటిస్తూ.. భౌతిక దూరానికి కట్టుబడి ఉంటారని నా విన్నపం. ఇదే మీరు నాకు ఇచ్చే విలువైన బహుమతి. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఈ సందర్భంగా ఎలాంటి టీజర్ కానీ.. ఫస్ట్ లుక్ కానీ విడుదల కావట్లేదనే విషయం మిమ్మల్ని చాలా నిరాశకు గురిం చేసిందని అర్థం చేసుకోగలను. ఫస్ట్ లుక్ లేదా టీజర్ సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంతగా కష్టపడిందనే విషయం నాకు తెలుసు.
కానీ ఓ ప్రచార చిత్రం మీ ముందుకు రావాలంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారుల ఆంక్షల వల్ల అది కుదర్లేదు. రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓక్ లేఖను పోస్ట్ చేసాడు.
— Jr NTR (@tarak9999) May 18, 2020



ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























