ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం అభిమానులు వేయి కళ్ళతో ఏడుస్తున్నారు. లాక్ డౌన్ కాబట్టి హీరోలు లు ఎలాగూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవట్లేదు.. ఇంకా అభిమానులను ఎలాగూ పుట్టినరోజు వేడుకలు జరపొద్దని చెపుతున్నారు. అయితే అభిమానులు ఎదురుచూసేది మాత్రం ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో కోసం. కానీ ఇప్పుడు వారి ఆశలకు నిరాశే ఎదురైంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘లాక్‌డౌన్ పలుమార్లు పొడిగించడంతో చిత్రానికి సంబంధించిన అన్ని పనులు నిలిచిపోయాయి. మేము ఎంతగా ప్రయత్నించినప్పటికీ తారక్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వలేకపోతున్నాం. కావున, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేము ఎలాంటి ఫస్ట్ లుక్ గానీ, వీడియో గానీ విడుదల చేయడం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఎన్టీఆర్ ను చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
As the lockdown gets extended time and again, work has come to a dead stop. And though we tried our best, we couldn’t finish work on a glimpse of @tarak9999 to give you all a treat on his birthday!
And so, we will not be releasing either a first look or a video on the occasion.— RRR Movie (@RRRMovie) May 18, 2020



ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























