హెబ్బా పటేల్ రిపీట్ చేస్తుందా?

21F Actress Hebah Patel To Repeat Her Success Formulae In Ram Pothineni Red Movie

‘అలా ఎలా’తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది హెబ్బా పటేల్. మొదటి సినిమాతోనే తన ఖాతాలో విజయాన్ని నమోదు చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ‘కుమారి 21 ఎఫ్’ రూపంలో తొలి బ్లాక్‌బస్టర్ జ‌మ చేసుకుంది. ఆపై ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ఆ పరంపరని కొనసాగించింది. అయితే, ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ ఆ స్థాయి విజయాలు సాధించకపోవడంతో హెబ్బా కెరీర్ కాస్త ట్రాక్ తప్పినట్టు అయింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘భీష్మ’తో మళ్ళీ ఓ విజయాన్ని అందుకుంది. కాక‌పోతే ఇందులో కథానాయికగా కాకుండా.. అతిథి పాత్రలో మెరిసింది హెబ్బా. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేసిన అతిథి పాత్ర ఇదే కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ‘భీష్మ’లో స్పెషల్ అప్పీయ‌రెన్స్ ఇచ్చిన హెబ్బా.. విడుదలకు సిద్ధమైన ‘రెడ్’లో ఓ ప్రత్యేక గీతంలో సందడి చేసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. హెబ్బా కెరీర్‌లో ఇదే ఫస్ట్ స్పెషల్ సాంగ్ కావడం.

మరి.. తొలిసారి అతిథిగా కనిపించిన ‘భీష్మ’తో విజయాన్ని అందుకున్న హెబ్బా పటేల్.. ఫస్ట్ టైమ్‌ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సందర్భంలోనూ సక్సెస్‌ను అందుకుంటుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.