చిరు, చరణ్ ఖాతాలో 5 లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్

Mega Star Chiranjeevi and Ramcharan Tej Gets 5 Lakh New Followers On Their Twitter

కేవలం రెండు రోజుల గ్యాప్‌లో ట్విట్టర్ ఖాతా తెరిచిన ‘మెగా ఫ్యామిలీ’ తండ్రీకొడుకులు.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా ఓ మైల్‌స్టోన్‌కి చేరువయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. ఉగాది సందర్భంగా మార్చి 25న ట్విట్టర్‌లో అకౌంట్ తెరిచిన చిరంజీవి.. ఎప్పటికప్పుడు తన మనోభావాలను, అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ తక్కువ సమయంలోనే తాజాగా ఐదు లక్షల ఫాలోవర్స్‌తో సరికొత్త మైల్‌స్టోన్‌కి చేరువయ్యారు.

ఇక తన పుట్టినరోజు (మార్చి 27) సందర్భాన్ని పురస్కరించుకొని.. ట్విట్టర్‌లో రీ – ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా తాజాగా 5 లక్షల ఫాలోవర్స్‌తో ట్విట్టర్ వేదికగా సరికొత్త మైలురాయికి చేరుకున్నారు.

మొత్తమ్మీద‌.. చిరు, చరణ్ ఇద్దరు కూడా ట్విట్టర్‌లో పోటాపోటీగా దూసుకుపోతూ ఉండటం విశేషమ‌నే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే.. చిరునే ఫాలోవర్స్ పరంగా డామినేట్ చేస్తూ ఉండటం విశేషం.

మరి.. రాబోయే కాలంలో ట్విట్టర్ వేదికగా చిరు, చరణ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.