కోలీవుడ్ స్టార్ సూర్యకి కలిసొచ్చిన దర్శకుల్లో కె.వి. ఆనంద్ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘అయన్’ (వీడొక్కడే), ‘మాట్రాన్’ (బ్రదర్స్), ‘కాప్పాన్’ (బందోబస్త్) చిత్రాలు మంచి ఆదరణనే పొందాయి. కట్ చేస్తే.. త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుందని తమిళ చిత్ర వర్గాల సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు.. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే సూర్య, ఆనంద్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.




ఇదిలా ఉంటే.. సూర్య తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ విడుదలకు సిద్ధమైంది. తన లక్కీ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో ‘అరువ’ చిత్రం చేయనున్న సూర్య.. ఆపై ‘అసురన్’ దర్శకుడు వెట్రిమారన్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాల తరువాతే కె.వి. ఆనంద్ సినిమా ఉండొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























