[POLL] మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మూవీకి ఏ జానర్ అయితే బాగుంటుంది?

Which Genre Will suit for Mahesh Babu and SS Rajamouli Combination? Vote Now

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. టాలీవుడ్ డ్రీమ్ కాంబినేషన్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చే సినిమా కోసం ప్రేక్షకవ‌ర్గాలతో పాటు పరిశ్రమ వర్గాలు కూడా చాన్నాళ్ళుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆ నిరీక్షణకు తగ్గట్టే.. త్వరలోనే మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుంది. మ‌ల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత త‌ను డైరెక్ట్ చేయబోతున్న సినిమా మహేష్ కాంబినేషన్‌దే అని రాజమౌళి ఇటీవ‌ల ప్రకటించాడు కూడా. శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ అధినేత డా.కె.యల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా రాజమౌళి చెప్పుకొచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి కెరీర్‌ను పరిశీలిస్తే ఇప్పటివరకు ఒక దానితో ఒకటి పొంతన లేని సినిమాలే చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. మహేష్‌తోనూ అదే పరంపరను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. తమ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఏ జానర్‌లో ఉంటుందో జక్కన్న ఇంకా ప్రకటించకపోయినా.. ప్రేక్షకుల్లో, పరిశ్రమవర్గాల్లో ఈ విషయంపై ప్రత్యేక చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో.. మహేష్, జక్కన్న కాంబినేషన్ మూవీకి ఏ జానర్ అయితే బాగుంటుందనే విషయానికి సంబంధించి ఓ పోల్ గేమ్ నిర్వహిస్తోంది ‘ది తెలుగు ఫిలిమ్ నగర్.కామ్’. కింద పేర్కొన్న ఏడు జానర్స్‌లో ఏదైతే బాగుంటుందో.. అనే మీ అభిప్రాయాన్ని మీ ఓటు ద్వారా తెలియ‌జేసే ప్రయత్నమిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

[totalpoll id=”43037″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.