శోభన్‌బాబు, విజ‌య‌శాంతి ‘దేవాలయం’కు 35 ఏళ్ళు

Shoban Babu and Vijaya Shanti Blockbuster Movie Devalayam Completes 35 Years

విప్లవాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు టి.కృష్ణ తీరే వేరు. ఆయన రూపొందించిన ప్ర‌తీ సినిమా ఈ కోవకు చెందినదే కావడం విశేషం. వాటిలో ‘దేవాలయం’ ఒకటి. నాస్తిక, ఆస్తిక వాదాల మధ్య వారధిగా నిలిచిన ఈ చిత్రంలో నటభూషణ్ శోభన్‌బాబు, విజయశాంతి నాయకానాయికలుగా నటించారు. రావుగోపాలరావు, సోమయాజులు, సుత్తి వేలు, పి.యల్.నారాయణ, నర్రా వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ, ‘అత్తిలి’ లక్ష్మి, శశికళ ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి, డా.సి.నారాయణరెడ్డి, అదృష్టదీపక్, వంగపండు సాహిత్యం సమకూర్చగా చక్రవర్తి అలరించే బాణీలు అందించారు. “దేహమేరా దేవాలయం”, “నీ నుదుట కుంకుమా నిత్యమై”, “మాధవుడే ఎత్తినాడు పది అవతారాలు”(దశావతారాల పాట), “హృదయాలయాన తొలిసారి”, “నమామి నాగభరణా”, “అమ్మో బయలెల్లినాడూ దేవుడు”.. ఇలా ఇందులోని పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. శోభన్‌బాబు సమర్పణలో శ్రీనికేతన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై యలమంచి రాజ్యలక్ష్మి, బి.లక్ష్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 1985 మే 15న విడుదలైన ‘దేవాలయం’.. నేటితో 35 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =