‘నేర్‌కొండ పార్‌వై’(బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ `పింక్`కి తమిళ్ వెర్షన్) వంటి విజయవంతమైన చిత్రం తరువాత కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వలిమై’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్‌కి జోడిగా ‘కాలా’ ఫేమ్ హ్యూమా ఖురేషి నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా బాణీలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని 2020 దీపావళికి లేదంటే 2021 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కోలీవుడ్ సర్కిల్స్ కథనాల ప్రకారం.. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 వేసవికి వాయిదా పడినట్టు తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఆ వివరాల్లోకి వెళితే.. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వలిమై’కి కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ బ్రేక్ పడింది. అందుకే ముందు అనుకున్నట్టుగా ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికో లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే.. 2021 వేసవికి వాయిదా వేస్తే బాగుంటుందని అజిత్ అండ్ టీమ్ భావిస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలోనే ‘వలిమై’ విడుదల తేదీకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























