నాకు ఇష్టమైన ముగ్గురు హీరోలు వారే..!

Actress Trisha Krishnan Reveals About Her Favourite Heroes
Actress Trisha Krishnan Reveals About Her Favourite Heroes

‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. ‘వర్షం’ సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ హవా నడుస్తుండటంతో తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పొచ్చు. అయితే తమిళ్, మలయాళంలో మాత్రం పలు సినిమాలతో బిజీగానే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటి వరకూ తన సినీ కెరీర్లో సీనియర్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకూ అందరితో నటించగా.. తన ఫెవరెట్ హీరోలు మాత్రం ముగ్గురే అని చెపుతుంది. కరోనా వల్ల ఇంట్లోనే ఉండటంతో సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉన్న త్రిష అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ సినిమాలో మీకు ఇష్టమైన హీరోలు ఎవరని అడుగగా.. మోహన్ లాల్, కమల్ హాసన్ ఇంకా అమీర్ ఖాన్ అని చెప్పింది. ఇక కమల్ హాసన్, మోహన్ లాల్ తో ఇప్పటికే త్రిష నటించేసింది. ఇంకా అమీర్ ఖాన్ తో నటించాలి. మరి త్రిషకు ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చూద్దాం.

ఇదిలా ఉండగా చిరు సినిమా ఆచార్య లో నటించే అవకాశం దక్కింది కానీ డేట్స్ కుదరక తప్పుకోవాల్సి వచ్చింది. అయితే చిరు తర్వాత సినిమాల్లో త్రిషకు మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి తెలుగులో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.