తన ప్రేయసి మిహీకా బాజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు రానా నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రానాకు సోషల్ మీడియలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా చేరిపోయారు. మిహిక, సోనం మంచి స్నేహితులని తెలిసిందే. ఇప్పుడు తాజాగా మిహిక కు సోనమ్ కపూర్ కూడా దీనిపై స్పందించి అభినందనలు తెలిపారు. ‘‘డార్లింగ్ బేబీ మిహిక… నీకు శుభాకాంక్షలు. లవ్ యూ. అత్యుత్తమైనవి పొందేందుకు నువ్వు అర్హురాలివి. రానా.. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా’’ అంటూ సోనమ్ కపూర్ రానా, మిహిక బజాజ్‌కు అభినందనలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Congratulations Rana and my lovely miheeka.. you guys are going to be amazing together! Welcome to the fam Rana! https://t.co/iwL0KePBWV
— Sonam K Ahuja (@sonamakapoor) May 12, 2020




ఇక ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసే అవకాశం ఉందని… అంతకు ముందే కూడా జరగవచ్చని రానా తండ్రి సురేష్ బాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అన్ని విషయాలు ఖరారైన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో తాము బిజీగా ఉండేలా పిల్లలిద్దరూ పని కల్పించారని చెప్పారు. పెళ్లి ప్లానింగ్ లో ప్రస్తుతం తామంతా బిజీగా ఉన్నామని తెలిపారు.
ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























