సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై అప్పుడప్పుడు కామెంట్లు రావడం చూస్తూనే ఉంటాం. వాటికి వాళ్ళు కూడా అప్పుడప్పుడు రివర్స్ కౌంటర్ లు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనపై వచ్చిన కామెంట్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ దుకాణం నుంచి చేతిలో కొన్ని సీసాలు, కొన్ని ప్యాకెట్లతో వస్తూ అందులో ఆమె కనిపిస్తుంది. ఇక దీనిపై కమాల్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ, లాక్ డౌన్ సందర్భంగా రకుల్ ప్రీత్ ఏం కొనుగోలు చేసింది? మద్యం ఏమైనా కొనుగోలు చేసిందా? అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనికి రకుల్ ప్రీత్ ఆసక్తికరంగా స్పందించింది. ‘అయ్యో, మెడికల్ షాపుల్లో కూడా మద్యం అమ్ముతారని నాకు తెలియదే!’ అంటూ బదులిచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి రకుల్ ఇది మొదటిసారి ఏం కాదు. ఇంతకుముందు కూడా పలువురు రకుల్ డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేయగా.. వాటికి కూడా రకుల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు.
ఇక కరోనా వైరస్ రోజు రోజు కు వ్యాపిస్తున్న వేళ పేద వాళ్లకు అండగా ఎంతోమంది ముందుకొస్తున్నారు. రకుల్ కూడా తన పెద్ద మనసు చాటుకుంది. తన ఇంటికి సమీపంలో తిండిలేక సతమతమవుతున్న వారికి సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 కుటుంబాలకు రెండు పూటలా భోజనాన్ని అందిస్తుంది.
Oh wow ! I wasn’t aware that medical stores were selling alcohol 🤔😂😂 https://t.co/3PLYDvtKr0
— Rakul Singh (@Rakulpreet) May 7, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: