ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా… ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా వున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈవిషయాన్ని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. స్క్రిప్ట్ వర్క్ తో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ రోజుకో వార్త మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటీకే ఎన్నో వార్తలు రాగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది.
ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వుండనుందనేది తాజా సమాచారం. డిఫరెంట్ లుక్ తో .. చాలా పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తోంది. 2021 చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెడతారట. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ పై .. ఆయన తయారు చేసిన కథపై నమ్మకంతో ఎన్టీఆర్ రెండేళ్ల పాటు డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. మరి ఇవి కేవలం రూమర్స్ ఆ.. నిజామా అన్నది తెలియాలంటే క్లారిటీ వచ్చేదాక ఆగాల్సిందే.
కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యష్ తో కె.జి.ఎఫ్2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్-ప్రభాస్ సినిమా కూడా ఉంటుంది అంటున్నారు. మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అయ్యేలోపు ప్రభాస్ తో సినిమా కానిచ్చేస్తాడా.. లేక ఈ సీక్వెల్ తరువాత ఎన్టీఆర్ తోనే చేస్తాడా ఇవన్నీ తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే..
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































