యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్లో పలు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. వాటిలో ‘100% లవ్’ ఒకటి. ‘ఏ మాయ చేసావె’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత చైతు హీరోగా రూపొందిన ‘100% లవ్’ కూడా అదే బాట పట్టింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో చైతుకి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. కె.ఆర్.విజయ, విజయకుమార్, నరేష్, నందు, తార ఆలీషా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, యమ్.యస్.నారాయణ ముఖ్య భూమికలు పోషించగా మేఘనా నాయుడు ప్రత్యేక గీతంలో మెరిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చంద్రబోస్, శ్రీమణి(తొలి పరిచయం), రామజోగయ్యశాస్త్రి గీతరచనకు దేవిశ్రీ ప్రసాద్ ఛార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించారు. “ఇన్ఫేచ్యుయేషన్”, “ఎ స్క్వేర్ బి స్క్వేర్” (రెండు వెర్షన్స్), “అహో బాలు”, “దటీజ్ మహాలక్ష్మి”, “తిరు తిరు గణనాథ”, “డియాలో డియాలో”, “దూరం దూరం”, “పంతమెక్కడో”, “పెళ్ళితోనే”.. ఇలా ప్రతీ గీతం విశేషాదరణ పొందింది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ ఈ సినిమాని నిర్మించారు. పలు ప్రాంతీయ పురస్కారాలను కైవసం చేసుకున్న ఈ చిత్రాన్ని.. బెంగాలీలో ‘ప్రేమ్‌కి భుజిని’(2016) పేరుతోనూ, తమిళంలో ‘100% కాదల్’(2019) టైటిల్‌తోనూ పునర్నిర్మించడం విశేషం. 2011 మే 6న విడుదలైన ‘100% లవ్’.. నేటితో 9 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: