‘మనం’(2014) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నాడని టాక్. కాగా, ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్టోరీలైన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ‘ఎవరైనా ఏ చిన్న సాయం చేసినా కృతజ్ఞత వ్యక్తం చేయడమన్నది మనిషి కనీస కర్తవ్యం’ అని నమ్మే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథతో ‘థాంక్యూ’ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.




మరి, ‘మనం’ తరువాత చైతు, విక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. వారిద్దరి కెరీర్‌కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























