‘పోకిరి’ సినిమా నేనే చేయాలి.. కానీ మిస్సయ్యింది..!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కలయికలో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా నిన్నటితో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పూరీ పంచ్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులోమహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ హీరోయిన్‌గా నటించాల్సిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగన ఆ విషయాన్ని తెలిపింది. `నేను `గ్యాంగ్‌స్టర్` సినిమా ఆడిషన్స్‌కు వెళ్లిన సమయంలోనే `పోకిరి` ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. రెండింటికీ నేను హాజరయ్యాను. రెండు సినిమాల్లోనూ నాకు అవకాశం వచ్చింది. అయితే ముందుగా `గ్యాంగ్‌స్టర్`కు డేట్లు ఇచ్చేయడంతో `పోకిరి` చేయలేకపోయాను. లేకపోతే టాలీవుడ్‌లో నేను పెద్ద హీరోయిన్ అయ్యుండేదాన్ని` అని కంగన చెప్పింది. మరి నిజంగానే పోకిరి లో కంగనా ఉంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలియానా మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇలియానా ప్లేస్ లో ఇంకో హీరోయిన్ ను కూడా ఉహించుకోలేము.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.