సందీప్ వంగా మొదలు పెట్టిన బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అగ్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకూ.. పలువురు డైరెక్టర్స్ వరకు వెళ్ళింది. ఇక ఇన్నిరోజులు అల్లు అర్జున్.. ప్రభాస్ మిస్ అవుతున్నారు అనుకునేలోపు రాజమౌళి ఛాలెంజ్‌ని స్వీకరించిన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ టాస్క్ పూర్తి చేసి… తర్వాత ఆయన ఈ ఛాలెంజ్‌ని ప్రభాస్‌కి, అల్లు అర్జున్‌కి విసురుతున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక వీళ్ళు కూడా అయిపోయారు. ఇంకా కొంత మంది యంగ్ హీరోస్ మిగిలారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



ఇక ఇదిలా ఉండగా మన టాలీవుడ్ లో స్టార్ట్ అయిన ఈ ఛాలెంజ్ టాలీవుడ్ వరకే పరిమితం అవుతుందేమో అవుకున్నాం కానీఇప్పుడు ఇది రామ్ చరణ్ వల్ల బాలీవుడ్ కి.. విజయ్ దేవరకొండ వాళ్ళ మాలీవడ్ కి వెళ్ళింది. రాజమౌళి ఛాలెంజ్ పూర్తి చేసి చెర్రీ రణవీర్ సింగ్ ను కూడా నామినేట్ చేసాడు. ఇక కొరటాల శివ ఛాలెంజ్ ను స్వీకరించిన విజయ్ నిన్న నేను చేయలేను.. మా అమ్మ నన్ను ఇంకా చిన్న పిల్లాడిగానే చూస్తుంది.. కానీ తప్పకుండా నా వీడియో గ్లింమ్ప్స్ మాత్రం పెడతా అని చెప్పాడు. చెప్పినట్టుగానే ఈరోజు ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. విజయ్ పోస్ట్ చేసిన వీడియో ఒక హెచ్చరికతో ప్రారంభవుతుంది. ఇంట్లో ఇలాంటి పనులు చేయొద్దని… తల్లిదండ్రుల నుంచి కష్టాలు తప్పవని విజయ్ హెచ్చరించాడు. నిద్ర లేచిన తర్వాత బెడ్ సర్దడం, బాటిల్స్ క్లీన్ చేయడం, మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడం, వీడియో గేమ్ ఆడటం, వార్డ్ రోబ్ క్లీన్ చేయడం వంటివన్నీ వీడియోలో ఉన్నాయి. వీడియో చివరిలో… ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులతో ఉన్నప్పుడు సంక్షోభం అనిపించదని చెప్పాడు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఒకరికొకరు సహాయసహకారాలను అందించుకోవాలని సూచించాడు. అలాగే ఈ చాలెంజ్ ను మలయాళ హీరో దుల్హర్ సల్మాన్ కి విసిరాడు. మరి ‘బీ ద రియల్ మ్యాన్’ సవాల్ ను రణవీర్, దుల్కర్ స్వీకరిస్తారా లేదా..? వాళ్ళ వీడియోస్ ఎప్పుడొస్తాయో చూద్దాం మరి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























