కొన్ని సినిమాలు చేసేప్పుడు అనుకోకుండా కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. కొన్ని సినిమాలకు అయితే పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి. నిజానికి సినిమా తీసేవాళ్ళు ఆ ఉద్దేశంతో తీయకపోయినప్పటికీ ఒక్కోసారి ఆ పదాలనో, సన్నివేశాలనో తెసివేయాల్సి వస్తుంది. ఒక్కసారి క్షమాపణలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. అసలు సంగతేంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన `వారనె అవశ్యముండ్` సినిమాలో ముంబైకి చెందిన రిపోర్టర్ చేతనా కపూర్ ఫోటో వాడారట. దానితో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఈ సినిమాలో తన ఫొటోను అవమానకరంగా ఉపయోగించారని, అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని, సినిమా నుంచి తన ఫొటోను తొలగించాలని లేదా బ్లర్ చేయాలని హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడిని ట్యాగ్ చేస్తూ చేతన ట్వీట్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో దుల్కర్ సల్మాన్ వెంటనే స్పందించాడు. `దీనికి మేం పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ఇది ఎలా జరిగిందో నేను తెలసుకుంటాను. మీ ఫొటోను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కనుక్కుంటాను. నా తరఫున, మా చిత్రబృందం తరఫున నేను క్షమాపణలు చెబతున్నాను` అని దుల్కర్ రిప్లై ఇచ్చాడు. దర్శకుడు కూడా చేతనకు క్షమాపణలు చెప్పాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























