కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు.. వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలు లేకపోయినా.. కలిస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన ఆలోచనలోంచి పుట్టిన కథకు తెరరూపమే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో.. కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ బ్రేక్ పడింది. లాక్ డౌన్ అనంతరం.. చిత్రీకరణని పునఃప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు జక్కన్న. అదేమిటంటే.. ఈ సినిమా అందరూ అనుకుంటున్నట్టు పేట్రియాటిక్ డ్రామా కాదని.. బ్రిటిషర్స్ను ఎదిరించే ఇద్దరు పోరాట యోధుల మధ్య స్నేహం చిగురిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో తెరకెక్కుతోందని వెల్లడించారాయన. మరి.. రియల్ లైఫ్‌లో మంచి ఫ్రెండ్స్ అయిన తారక్, చరణ్.. రీల్ లైఫ్‌లోనూ ఫ్రెండ్స్ పాత్రల్లో ఏ మేరకు అలరిస్తారో తెలియాలంటే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వరకు వేచిచూడాల్సిందే.
కాగా, దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2021 ప్రథమార్ధంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: