సినీ పరిశ్రమలో కొన్ని కొన్ని హిట్ కాంబినేషన్స్ చాలా రేర్ గా సెట్ అవుతాయి. అలా సెట్ అయినా కాంబినేషన్ ను జాగ్రత్తగా కాపాడుకుంటే ఓకే.. అలా కాకుండా ఈగో లకు పోయి ఎవరి దారి వారు చూసుకుంటే.. ఒక్కోసారి అది వర్కౌట్ అయినా ఒక్కోసారి మాత్రం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అదే తప్పు చేసి డౌన్ అయిపోయాడు శ్రీను వైట్ల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీను వైట్ల గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడంటే ఫామ్ కోల్పోయి హిట్ సినిమాలు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు కానీ కెరీర్ టాప్ ఫామ్ లో ఉన్నప్పుడు బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఆనందం, ఢీ, రెడీ, దూకుడు, ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను అందించాడు. తన సినిమాలతో కొత్త రకం కామెడీ కి ఒరవడి తీసుకొచ్చాడు. అయితే శ్రీను వైట్ల సక్సెస్ వెనుక మరో ఇద్దరి పాత్రల గురించి కూడా మనం చెప్పుకోవాలి. వారే… రచయితల ద్వయం కోన వెంకట్ – గోపి మోహన్. వీరిద్దరితో కలిసి శ్రీను వైట్ల ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఈ ముగ్గురూ కలిసి అందించిన మొదటి సూపర్ డూపర్ హిట్ ఢీ. అక్కడినుండి దూకుడు వరకూ ముగ్గురూ కలిసే పనిచేశారు. కానీ ఆ తర్వాతే శ్రీను వైట్ల-కోన వెంకట్ మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో ఎవరి దారి వారు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే శ్రీను వైట్ల డైరెక్టర్ ఆయనకు సినిమాలు వస్తాయి.. అలాగే కోన వెంకట్ రచయిత కాబట్టి ఆయనకు కూడా కథలు వస్తూనే ఉంటాయి. వృత్తి పరంగా ఎవరికీ ఇబ్బంది లేకపోయినా కాంబినేషన్ అనేది ఒకసారి పోయినప్పుడు అదే రేంజ్ లో హిట్స్ రావాలంటే చాలా కష్టం. అదే పరిస్థితి వచ్చింది శ్రీను వైట్లకి. వీరు విడిపోయిన తర్వాత ఒక టీంను ఏర్పర్చుకుని కథలు రాసుకున్నాడు. అయితే ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. ఏదో ‘బ్రూస్ లీ’ సినిమా కోసం తప్పక కలిసి పని చేశారు.. ఇక ఆ సినిమా ఫలితం కూడా వీరిద్దరి కలయికలాగే వచ్చింది. ఇక ఆ తరువాత ఒకరిపై ఒకరు ఏదో ఒక సందర్భంలో కామెంట్స్ వేసుకుంటూనే వున్నారు. దీనితో వీరిద్దరూ కలవడం ఇక కష్టమే అనుకున్నారు అందరూ.
అయితే ఇప్పుడు మరోసారి వీరు కలిసి పని చేసే అవకాశం ఉన్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ శ్రీను వైట్లతో వర్క్ చేయడానికి తనకు ఏమీ ఇబ్బంది లేదన్నాడు. దీనితో మళ్లీ వీరిద్దరు కలిసి వర్క్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు శ్రీనువైట్ల కూడా వారితో కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఇక ఢీ సినిమా రిలీజై ఈ రోజుతో 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అప్పటి ఆన్ లొకేషన్ ఫొటో ఒకటి షేర్ చేసిన శ్రీను వైట్ల చాలా ఎమోషనల్ అవుతూ ట్వీట్ పెట్టాడు. అందులో సినిమాలో నటించిన అందరితో పాటు టెక్నీషియన్లకూ థ్యాంక్స్ చెప్పాడు. అందులో కోన వెంకట్ పేరు కూడా ఉండటం విశేషం. ఇక ఢీ 2 సీక్వెల్ లో భాగంగా వేరు కలిసి పనిచేసే అవకాశం ఉందన్న వార్తలు పుంజుకున్నాయి. మరి ఇప్పటికే వున్న మనస్పర్థలు , ఈగోలు పక్కన పెట్టి ముగ్గురు కలిస్తే.. మళ్ళీ మంచి హిట్ సినిమా ప్రేక్షకులకు అందించవచ్చు.
My heartfelt thanks to my partner @konavenkat99 ji,for his strong belief on my talent & asking me to work for the story development. Teamwork excelled.A memorable journey from then onwards with dir @SreenuVaitla garu & @konavenkat99 ji.
Thanks to #Dhee Team.#13YearsForDhee https://t.co/iMwTSgu1Qs— Gopi Mohan (@Gopimohan) April 13, 2020



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























