య‌న్టీఆర్‌తో జాన్వీ క‌పూర్?

Young Tiger NTR Teams Up With Janhvi Kapoor For Trivikram Movie

`అర‌వింద స‌మేత‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేషన్‌లో మ‌రో సినిమా రాబోతున్న విష‌యం విదిత‌మే. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్, య‌న్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అలాగే వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో వేస‌వి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో క‌థానాయిక పాత్ర కోసం “అతిలోక సుంద‌రి” శ్రీ‌దేవి త‌న‌య జాన్వీ క‌పూర్ తో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే జాన్వీ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ప్ర‌స్తుతం జాన్వీ న‌టించిన ‘గుంజ‌న్ స‌క్సేనా’, ‘రూహి అఫ్జానా’ చిత్రాలు విడుద‌ల‌కు సిధ్ధం కాగా… ‘దోస్తానా 2’ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.