`ఆచార్య‌` ఫ‌స్ట్ లుక్ అప్ డేట్

Megastar Chiranjeevi Acharya Movie First Look To Release On This Special Date

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా… మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడని టాక్. రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను శ్రీ‌రామ‌న‌వ‌మి పండగ సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు సమాచారం. మంగ‌ళ‌వారం లేదా బుధ‌వారం ఫ‌స్ట్ లుక్ పై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. రీ ఎంట్రీలో `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` రూపంలో రెండు వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించిన‌ చిరు.. `ఆచార్య‌`తో హ్యాట్రిక్ న‌మోదు చేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.