ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘టక్ జగదీష్’ కాగా… మరొకటి ‘శ్యామ్ సింగ్ రాయ్’. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘టక్ జగదీష్’కు సంబంధించి ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరిగింది. కాగా, జూన్ 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా… సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ‘శ్యామ్ సింగ్ రాయ్’ సినిమా విషయానికొస్తే… ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో నాని ఓ డిఫరెంట్ లుక్లో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది. పైగా విభిన్నమైన కథాకథనాలతో సాగే సెకండాఫ్ చాలా ఉత్కంఠకు గురి చేస్తుందని సమాచారం. అంతేకాదు… సెకండాఫ్లో నాని నటన సినిమాకే ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మరి, రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ప్రేక్షకుల ముందుకు రానున్న నాని… ఎటువంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
ఇదిలా ఉంటే… నాని 25వ చిత్రం `వి` విడుదలకు సిద్ధమైంది. ఇందులో నాని ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: