నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి బాలయ్య, బోయపాటి కలయికలో ‘సింహా’(2010) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. జగపతిబాబు, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ, ‘ఆహుతి’ ప్రసాద్, సుజాతా కుమార్, కళ్యాణి, ఈశ్వరీ రావు, సితార తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సుహాసిని అతిథి పాత్రలో కనిపించగా… హంసా నందిని ఐటమ్ సాంగ్‌లో నర్తించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామజోగయ్య శాస్త్రి గీత రచనకు… టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించారు. ముఖ్యంగా “లెజెండ్” అంటూ సాగే టైటిల్ సాంగ్‌తో పాటు “నీ కంటి చూపుల్లో”, “టైమ్ బాంబ్”, “తంజావురు”, “లస్కు టపా”, “ఓం శర్వాణి” వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ… `ఉత్తమ చిత్రం`తో పాటు`ఉత్తమ నటుడు` (బాలకృష్ణ) `ఉత్తమ దర్శకుడు` (బోయపాటి శ్రీను), `ఉత్తమ ప్రతినాయకుడు` (జగపతిబాబు), `ఉత్తమ గాయకుడు` (విజయ్ యేసుదాస్), `ఉత్తమ ఎడిటర్` (కోటగిరి వెంకటేశ్వరరావు), `ఉత్తమ ఫైట్ మాస్టర్` (రామ్ లక్ష్మణ్), `ఉత్తమ మాటల రచయిత` (ఎం. రత్నం)… ఇలా 8 `నంది` అవార్డులను సొంతం చేసుకుంది. 2014 మార్చి 28న విడుదలైన ‘లెజెండ్’… నేటితో ఆరేళ్ళు పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























