‘ఆర్ ఆర్ ఆర్‌’లో మోహ‌న్ లాల్?

RRR Movie Makers Approach Legendary Actor Mohanlal For A Pivotal Role

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. `గాండీవం` (స్పెష‌ల్ సాంగ్), ‘మ‌న‌మంతా’, ‘జ‌న‌తా గ్యారెజ్’ వంటి స్ట్రెయిట్ ఫిల్మ్స్‌తో తెలుగునాట కూడా సందడి చేసిన ఈ కంప్లీట్ యాక్ట‌ర్… త్వ‌ర‌లో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి సిధ్ధ‌ప‌డుతున్నాడ‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపుని పొందిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్ర‌స్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ (రౌద్రం ర‌ణం రుధిరం) పేరుతో ఓ పేట్రియాటిక్ డ్రామాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగర్ య‌న్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో… ఓ కీల‌క పాత్ర కోసం మోహ‌న్ లాల్‌ను సంప్ర‌దించిన‌ట్టు భోగ‌ట్టా. పాత్ర తీరు తెన్నులు న‌చ్చ‌డంతో మోహ‌న్ లాల్ కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాలీవుడ్ టాక్.

త్వ‌ర‌లోనే `ఆర్ ఆర్ ఆర్`లో మోహ‌న్ లాల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

డీవీవీ దాన‌య్య ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న ప‌లు భాష‌ల్లో విడుద‌ల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.