కరోనా వైరస్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న స్టార్ హీరోయిన్ తమన్నా తన షూటింగ్ అనుభవాలు, మూవీ కమిట్ మెంట్స్ గురించి మీడియా కు వెల్లడించారు. ముందుగా బ్లాక్ బస్టర్ “బాహుబలి ” మూవీ గురించి తమన్నా మాట్లాడుతూ .. కుండపోత వర్షాలలో మహాబలేశ్వర్ లో తనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని , మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్న ప్రాంతాలలో షూటింగ్ జరిగిందని, తాను షూటింగ్ లో ఉండగా తన గ్రాండ్ మదర్ మరణించారని, యూనిట్ సభ్యులందరూ తనకు సపోర్ట్ గా నిలిచారని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సౌత్ హీరోలు విజయ్ దేవరకొండ, శివ కార్తికేయన్ లతో నటించాలని ఉందని, హిందీ లో విక్కీ కౌశల్ తో నటించాలని ఉందని, తాను నటిస్తున్న బాలీవుడ్ మూవీ”బోలే చూడియాన్ ” కొంత భాగం షూటింగ్ జరుపుకుందని, తమిళ వెబ్ సిరీస్ “ది నవంబర్ స్టోరీ” లో నటిస్తున్నానని, తాను హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “క్వీన్” మూవీ తెలుగు రీమేక్ “దటీజ్ మహాలక్ష్మి ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉందని, గృహ నిర్బంధ టైమ్ లో హ్యాపీ గా ఉన్నానని తమన్నా తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































