శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ “పింక్” తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో నివేత థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ లో పవన్ కళ్యాణ్ జోడీ గా పూజ హెగ్డే, ఇలియానా, లావణ్య త్రిపాఠి పేర్లు వినిపించాయి. ఫైనల్ గా శృతి హాసన్ ఎంపిక అయ్యారు. శృతి హాసన్ అతిథి పాత్రలో నటిస్తున్నా పవన్ కళ్యాణ్ తో కొన్ని సీన్స్ , ఒక సాంగ్ ఉంటాయని సమాచారం. “గబ్బర్ సింగ్” , “కాటమరాయుడు”మూవీస్ లో పవన్ కళ్యాణ్ , శృతిహాసన్ జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ రద్దు అయినవిషయం తెలిసిందే. పరిస్థితులు చక్కబడిన తరువాత “వకీల్ సాబ్ ” మూవీషూటింగ్ షెడ్యూల్ విషయం తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































