హిందీ బాట ప‌డుతున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`?

Vijay Deverakonda World Famous Lover Goes To Bollywood

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ రూపొందించిన ఈ సినిమాలో విజ‌య్ కి జోడీగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, కేథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లి లిటే నాయిక‌లుగా న‌టించారు. గోపీసుంద‌ర్ సంగీత‌మందించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మించింది. వేలంటైన్స్ డే స్పెష‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజైన ఈ ప్రేమ‌క‌థా చిత్రం… కంటెంట్ విష‌యంలో ఓకే అనిపించుకున్నా, ఎగ్జిక్యూష‌న్ విష‌యంలో పూర్ మార్క్స్ తెచ్చుకుంది. ఫ‌లితంగా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయిందీ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ట్ చేస్తే… ఇప్పుడీ ల‌వ్ స్టోరీ హిందీ బాట ప‌ట్ట‌నుంద‌ట‌. ప్ర‌ముఖ హిందీ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడట‌. ఇప్ప‌టికే ఈ మేర‌కు రీమేక్ రైట్స్ కూడా పొందాడ‌ని టాక్. మ‌రి.. హిందీ వెర్ష‌న్ లో అయినా ఈ క‌థ కాసుల‌ వ‌ర్షం కురిపిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.