చిరు-కొరటాల మూవీ నుండి త్రిష ఔట్..!

Trisha Moves Out Of Chiru - Koratala Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Trisha,Chiranjeevi,Koratala Siva Movie,Trisha to get back to Tollywood with Chiranjeevi 152,#Chiru152,Chiranjeevi 152 Movie Latest News,Chiranjeevi 152 Film Live Updates

ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ చిరు-కొరటాల సినిమాకు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తాడా..? మహేష్ నటిస్తాడా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. అలా అని ఈ విషయంపై వార్తలూ ఆగలేదు. అప్పుడప్పుడు బన్నీ పేరు కూడా వినిపిస్తుంది. ఇక దీనిపైనే క్లారిటీ ఇవ్వలేక చిత్రయూనిట్ తలపట్టుకుంటే.. టైటిల్ కూడా పెద్దతలనొప్పిగా తయారైంది. నిజానికి ఈసినిమాకు ‘ఆచార్య’ టైటిల్ నే అనుకున్నారు. కానీ చిరు చేసిన చిరు పొరపాటు వల్ల మళ్ళీ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు దానికి తోడు మరో సమస్య వచ్చి పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు త్రిష తప్పుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమాలో భాగం కాలేకపోతున్నా… టీమ్ కి అల్ ద బెస్ట్ అని ట్వీట్ లో పేర్కొంది.


కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవ‌ల పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా .. త్వ‌ర‌లోనే త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించ‌నుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మరి త్రిష ప్లేస్ లో ఏ హీరోయిన్ వస్తుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.