కరోనా ఎఫెక్ట్ – సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమేనా ..!

Corona Effect Shows Bad Impact On New Movie Releases,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Corona Effect,Corona Effect On Movie,Corona Effect On Movie Releases,Corona Effect New Movie Releases

కరోనా కరోనా కరోనా… ఇప్పుడు ఎక్కడ చూసినా… ఎవరి నోటి వెంట విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. చైనా లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. కరోనా ఎఫెక్ట్ కు చాలా వరకూ బయట తిరగడం మానేశారు జనాలు. ఇక ఈ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై కూడా బాగానే పడింది. చాలా సినిమాలు విదేశాల్లో షూటింగ్ లకు బ్రేక్ చెప్పేశాయి. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ అంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే మన దేశంలో పలు నగరాల్లో సినిమా థియేటర్స్ మూసివేశారు. సినిమా ఫంక్షన్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ వంటివి వాయిదా వేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌ వల్ల 21వ ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల (ఐఫా) ఉత్సవం కూడా వాయిదా పడింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి.. ప్రస్తుతం థియేటర్లకు ఆడియన్స్ రావడంలేదు. దీనితో ఇక్కడ కూడా సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉగాదికి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో నాని,సుధీర్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘వి’ కాస్త పెద్ద సినిమా. దాని తర్వాత ఒక మోస్తరుగా చెప్పుకోవాల్సిన సినిమా… రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’. నాని ‘వి’ సినిమా 24 రాత్రి ప్రీమియ‌ర్ షోల‌ని ఏర్పాటు చేశార‌ట‌. అయితే క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ఓవ‌ర్సీస్‌లో సినిమాల కోసం థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌. దీని కార‌ణంగానే ఈ సినిమా రిలీజ్‌ని మ‌రో వారం పాటు అయినా పోస్ట్ పోన్ చేయాల‌ని ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ నిర్మాత దిల్ రాజుని కోరిన‌ట్టు తెలిసింది. దీనితో ఈ చిత్ర రిలీజ్ వాయిదా ప‌డే అవ‌కాశాలు వున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏప్రిల్ 2 న వచ్చే సినిమాల రిలీజ్ విషయంలో కూడా కాస్త డౌట్ ఉంది. ఏప్రిల్ 2న నిశ్శబ్దం, ఉప్పెన, అరణ్య సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్స్ కి ఆడియన్స్ రావడం కష్టంగా ఉండటంతో ఈ సినిమాలను అదే రోజు రిలీజ్ చేయాలా లేక.. మార్చాలా అన్న డైలమాలో పడ్డారట దర్శకనిర్మాతలు. సమ్మర్ కాబట్టి హాలిడేస్ కలిసొస్తాయి.. ఇలా అన్నీ అలోచించి ఆ డేట్ లలో ఫిక్స్ చేసుకున్నారు. అయితే మ్యాగ్జిమమ్ వాయిదా పడే అవకాశమే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం డిసైడ్ అవుతారో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =