యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. వచ్చే సంవత్సరం చివరలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే నాయికగా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఆ పాత్రలో మరో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కనిపించబోతోందట. అదేగనుక నిజమైతే… ప్రభాస్, కత్రినా కాంబోలో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. వాస్తవానికి `సాహో`లోనే కత్రినా నాయికగా నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఈ సారైనా ఈ జోడీ మురిపిస్తుందేమో చూడాలి.
కాగా, కత్రినా ఇదివరకు తెలుగులో `మల్లీశ్వరి`, `అల్లరి పిడుగు` చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























