విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో… ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్, ఇటీవలే మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో పాట ప్రోమోను రిలీజ్ చేసారు. ‘ఈ మాయ పేరేమిటో’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఈ సినిమాలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























