స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి ల వివాహం 2011 సంవత్సరం మార్చి 6వ తేదీ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరికి తనయుడు అయాన్, తనయ అర్హ ఉన్నారు. అల్లు అర్జున్ తన వైఫ్ కు 9వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భం గా శుభాకాంక్షలు తెలుపుతూ తమ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేస్తూ , 9 సంవత్సరాల వివాహ బంధం, కాలం వేగం గా పరిగెడుతుంది, మన మధ్య ఉన్న ప్రేమ ప్రతి రోజూ
పెరుగుతుందని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




అల్లు అర్జున్ కుమారుడు అయాన్ తన పేరెంట్స్ కు వినూత్న పద్ధతి లో విషెస్ తెలిపారు. మామ్ , డాడ్ లకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ అల్లు హౌస్ అని డ్రాయింగ్ గీసిన లెటర్ తో అల్లు అయాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ లెటర్ ను అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న AA 20 మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























