ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ “పింక్ ” తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతుంది. అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “వకీల్ సాబ్ ” మూవీ ఫస్ట్ సింగిల్ “మగువా మగువా ” మార్చి 8వ తేదీ రిలీజ్ కానుంది. “మగువా మగువా ” సాంగ్ ప్రోమో ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. థమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రచించిన “మగువా మగువా ” గీతాన్ని సింగర్ సిద్ శ్రీరామ్ శ్రావ్యంగా ఆలపించారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























